Description
స్వయంభూ: ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీ: వారు యువత కొరకు ప్రత్యేకముగా స్థాపించిన విభాగమే I AUYSA . I AUYSA అనగా International Aumaujaya United Youngstars Association (ఓమౌజయ: యునైటెడ్ యంగ్‌స్టార్స్ అసోసియేషన్) యువతను శక్తివంతం చేసి, చైతన్యవంతులను చేసి, ఒక ఆదర్శవంతమైన యువతను అవతరింపచేయడమే I AUYSA లక్ష్యం.
సామాజిక సేవ, ప్రకృతి సంరక్షణ, నైతిక విలువలతో కూడిన జీవితం , భారతీయ ఋషీ సంస్కృతి యొక్క పునరుద్ధరణ, విశ్వ సౌభ్రాతృత్త్వం, మానవత్వం, మంచితనం లను పెంపొందించడమే I AUYSA యొక్క ఆశయం.
ప్రతి యువకుడిని ఒక నాయకుడిగా, ఒక శాస్త్రజ్ఞుడిగా, ఒక గురువుగా, ఒక తత్త్వజ్ఞుడిగా, ఒక మానవతావాదిగా తయారు చేయడమే I AUYSA ధ్యేయం.
I AUYSA -2 అను ఈ పుస్తకము సమకాలీన యువతకు విద్యారంగంలో, వృత్తిలో, కుటుంబంలో, సమాజంలో, జీవితంలో తాము ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారంగా రూపొందించబడినది. ప్రతి సమస్య పరిష్కారమునకై జైమహావిభోశ్రీ: వారు ఎంతో కరుణతో, ప్రేమతో ఒక ముద్రను, దృష్టిని, సాధన చేయవలసిన సమయాన్ని, సాధనచేయునపుడు పాటించవలసిన ఆహార నియమాలను అందించారు.
ఈ ఆత్మచైతన్య ముద్రాధ్యాన సాధన ద్వారా ఎందరో యువతీయువకులు, బాలబాలికలు తమతమ సమస్యలను పరిష్కరించుకున్నారు. ఇది సశాస్త్రీయంగా నిరూపించబడినది. కావున మీరు ప్రతి ఒక్కరూ ఈ ముద్ర సాధనను చేసి మీరు మీ జీవితంలో విజయం సాధించి, మీరు వెలిగి, ఈ ప్రపంచాన్ని వెలిగించాని ఆశిస్తున్నాము. ప్రతి విధ్యార్థి, ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు చదివి తీరవలసిన పుస్తకము ఇది.
ఈ పుస్తకంలోని ముద్రా ధ్యాన సాధన మీరు చేయ సంకల్పించుకున్నప్పుడు, స్వయంభూ: ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీ: వారిని దర్శించి వారి ఆజ్ఞను పొంది, సాధనకు ఉపక్రమించినచో, మీరు సర్వోత్కృష్టమైన ఫలితాలను పొందగలరు.