Description
I AUYSA అనునది యువశక్తి జాగృతి కొరకు ఎస్ పీ మాస్ట్రో వారు నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ యువతను శక్తివంతం, జ్ఞానవంతం, చైతన్యవంతం, ప్రేమపూరితం, మానవత్వం, మంచితనంతో మెలిగేలా చేసి ఇతరులను వెలిగేలా చేస్తుంది.
I AUYSA ద్వారా ప్రతి యువకుడిని ఎస్ పీ మాస్ట్రో వారు నాయకుడిగా, శాస్త్రజ్ఞుడిగా, గురువుగా, తత్త్వవేత్తగా, మానవతావాదిగా తీర్చిదిద్దడానికి సమాయత్తమయ్యారు. అందుకు ప్రతి నెల రెండవ ఆదివారం యువతకు ప్రత్యేక ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహింపబడుతాయి.
ఈ ‘‘I AUYSA-5 విశ్వసించు నిన్ను మించిన శక్తి లేదు’’ అను పుస్తకంలో ఎస్ పీ మాస్ట్రో వారు యువతకు ఇచ్చినటువంటి రెండు వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల సారాంశాన్ని మీకు అందిస్తున్నాము. మానవ దేహంలో గల శక్తికేంద్రాల గురించి, యువత అధిగమించాల్సిన ఆటంకాలైన భయం, అనుమానం, చింత, బాధ, సంశయం, విచారణ, ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ మరియు సుపీరియారిటీ కాంప్లెక్స్ గురించి ఎస్ పీ మాస్ట్రో వారు వివరించారు.
భౌతిక జీవితంలో ప్రధాన పాత్ర పోషించే మూలాధార, స్వాదిష్ఠాన, మణిపుర శక్తికేంద్రాల గురించి, యువత పాటించవలసిన ఆహారపు అలవాట్ల గురించి, జీవితంలో విజయపథంలో నడవడానికి వారు ఏర్పరుచుకోవలసిన జీవనశైలిని గురించి ఎస్ పీ మాస్ట్రో వారు విపులీకరించారు.
ఈ పుస్తకాన్ని ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు చదివి తీరాలి. ఈ పుస్తకాన్ని చదివి ఆచరించి ఆచరింపజేసి మీ జీవితంలో మీరు గెలిచి ఇతరులకు మార్గదర్శకులై నిలవాల్సిందిగా మనవి.