I AUYSA-7

90

ప్రజ్వల సంకల్పం

Category: Product ID: 1458

Description

I AUYSA అనునది యువశక్తి జాగృతి కొరకు ఎస్ పీ మాస్ట్రో వారు నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ  యువతను శక్తివంతం, జ్ఞానవంతం, చైతన్యవంతం, ప్రేమపూరితం, మానవత్వం, మంచితనంతో మెలిగేలా చేసి ఇతరులను వెలిగేలా చేస్తుంది.
I AUYSA ద్వారా ప్రతి యువకుడిని ఎస్ పీ మాస్ట్రో వారు నాయకుడిగా, శాస్త్రజ్ఞుడిగా, గురువుగా, తత్త్వవేత్తగా, మానవతావాదిగా తీర్చిదిద్దడానికి సమాయత్తమయ్యారు. అందుకు ప్రతి నెల రెండవ ఆదివారం యువతకు ప్రత్యేక ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహింపబడుతాయి.
I AUYSA-7 ‘‘ప్రజ్వల సంకల్పము ’’ ఈ పుస్తకములో ఎస్ పీ మాస్ట్రో వారు యువతకు ఇచ్చినటువంటి రెండు వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల సారాంశాన్ని మీకు అందిస్తున్నాము.
ఈ పుస్తకములో లక్ష్యనిర్దేశము, లక్ష్యసాధనకై ప్రణాళికాబద్ధత మరియు ప్రస్తుతములో జీవించడం గురించి వివరించడం జరిగినది. యువతకు ఉండవలసిన లక్షణాలైనటువంటి యునిక్‌నెస్‌, పర్సనాలిటీ, పర్సనల్‌ ఫ్యామిలీ యండ్‌ స్పిరుచ్చువల్‌ లైఫ్‌ గురించి ఎస్ పీ మాస్ట్రో వారు చక్కగా వివరించారు.
        ఈ పుస్తకాన్ని ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు చదివి తీరాలి. ఈ పుస్తకాన్ని చదివి ఆచరించి ఆచరింపజేసి మీ జీవితంలో మీరు గెలిచి ఇతరులకు మార్గదర్శకులై నిలవాల్సిందిగా మనవి.
0
    0
    Your Cart
    Your cart is emptyReturn to Shop