I AUYSA-10

140

శ్రమానందమే ఆలోచన

Category: Product ID: 1464

Description

I AUYSA అనునది యువశక్తి జాగృతి కొరకు ఎస్ పీ మాస్ట్రో వారు
నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ యువతను శక్తివంతం, జ్ఞానవంతం,
చైతన్యవంతం, ప్రేమపూరితం, మానవత్వం, మంచితనంతో మెలిగేలా చేసి ఇతరులను
వెలిగేలా చేస్తుంది.
I AUYSA ద్వారా ప్రతి యువకుడిని ఎస్ పీ మాస్ట్రో వారు నాయకుడిగా,
శాస్త్రజ్ఞుడిగా, గురువుగా, తత్త్వవేత్తగా, మానవతావాదిగా తీర్చిదిద్దడానికి సమాయత్తమయ్యారు.
అందుకు ప్రతి నెల రెండవ ఆదివారం యువతకు ప్రత్యేక ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా
తరగతులు నిర్వహింపబడుతాయి.
ఈ I AUYSA – 10“శ్రమానందమే ఆలోచన” అను పుస్తకంలో ఎస్ పీ మాస్ట్రో
వారు యువతకు ఇచ్చిన రెండు వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల సందేశాన్ని పొందుపరచడం
జరిగినది. ఈ పుస్తకంలో ఎస్ పీ మాస్ట్రో వారు యువతలో మెదిలే జ్ఞాపకాలు, ఊహలు,
కల్పనలు, కలలు, విచారణల గురించి వివరించారు. ప్రపంచంలో యువకుడికి విజయం
కీలకం. ఆ విజయానికి పునాది ప్రణాళిక. ఈ పుస్తకంలో ప్లానింగ్ అండ్ సక్సెస్ అను
అంశం గురించి వివరించారు.
ఈ పుస్తకాన్ని ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు చదివి
తీరాలి. ఈ పుస్తకాన్ని చదివి, ఆచరించి, ఆచరింపజేసి మీ జీవితంలో మీరు గెలిచి, ఇతరులకు
మార్గదర్శకులై నిలవాల్సిందిగా సహృదయపూర్వకముగా ఆశిస్తున్నాము.

0
    0
    Your Cart
    Your cart is emptyReturn to Shop