Description
I AUYSA అనునది యువశక్తి జాగృతి కొరకు ఎస్ పీ మాస్ట్రో వారు
నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ యువతను శక్తివంతం,
జ్ఞానవంతం, చైతన్యవంతం, ప్రేమపూరితం, మానవత్వం, మంచితనంతో మెలిగేలా చేసి ఇతరులను వెలిగేలా చేస్తుంది.
I AUYSA ద్వారా ప్రతి యువకుడిని ఎస్ పీ మాస్ట్రో వారు నాయకుడిగా,
శాస్త్రజ్ఞుడిగా, గురువుగా, తత్త్వవేత్తగా, మానవతావాదిగా తీర్చిదిద్దడానికి సమాయత్తమయ్యారు.
అందుకు ప్రతి నెల రెండవ ఆదివారం యువతకు ప్రత్యేక ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా
తరగతులు నిర్వహింపబడుతాయి.
ఈ I AUYSA-11 “స్వతంత్ర మనసే నిజమైన భగవంతుడు” అను పుస్తకంలో
ఎస్ పీ మాస్ట్రో వారు సాఫ్ట్ స్కిల్స్ ఫర్ సక్సెస్ ఇన్ కెరీర్ అను అంశము గురించి, సమస్యల
పరిష్కారం గురించి, ఇతరులను ఎలా ఒప్పించాలి, మనం ఎలా ఇతరులను ఒప్పుకోవాలి,
వ్యక్తులతో, పరిస్థితులతో, వృత్తిలో, ధనముతో ఎలా వ్యవహరించాలి, భావవ్యక్తీకరణ, సంభాషణా
చతురతా నైపుణ్యముల గురించి, మాటలు, ఆలోచనలు, భావములు, భావావేశములు, మన
వ్యక్తిగత వైఖరుల గురించి, ఆత్మగౌరవం, ఆత్మహుందాతనం, ఆత్మవిశ్వాసం మొదలైనటువంటి
అంశముల గురించి చాలా చక్కగా వివరించారు.
అలాగే మన జీవితంలోని బలహీనమైన నెగిటివ్ విషయములను ఎలా ఆయుధాలుగా
వాడుకోవాలి, పాజిటివ్ విషయాలతో ఎలా వ్యవహరించాలి మరియు ఇంగితజ్ఞానం, సరియైన
సమాచారము, సరియైన సంబంధబాంధవ్యము, భావవ్యక్తీకరణల గురించి చాలా చక్కగా
వివరించారు.
ఈ పుస్తకాన్ని ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు చదివి
తీరాలి. ఈ పుస్తకాన్ని చదివి, ఆచరించి, ఆచరింపజేసి మీ జీవితంలో మీరు గెలిచి, ఇతరులకు
మార్గదర్శకులై నిలవాల్సిందిగా సహృదయపూర్వకముగా ఆశిస్తున్నాము.