Description
I AUYSA అనునది యువశక్తి జాగృతి కొరకు ఎస్ పీ మాస్ట్రో వారు నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ యువతను శక్తివంతం, జ్ఞానవంతం, చైతన్యవంతం, ప్రేమపూరితం, మానవత్వం, మంచితనంతో మెలిగేలా చేసి ఇతరులను వెలిగేలా చేస్తుంది.
I AUYSA ద్వారా ప్రతి యువకుడిని ఎస్ పీ మాస్ట్రో వారు నాయకుడిగా, శాస్త్రజ్ఞుడిగా, గురువుగా, తత్త్వవేత్తగా, మానవతావాదిగా తీర్చిదిద్దడానికి సమాయత్తమయ్యారు. అందుకు ప్రతి నెల రెండవ ఆదివారం యువతకు ప్రత్యేక ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహింపబడుతాయి.
ఈ పుస్తకములో యువత తన మైండ్‌సెట్‌ను ఎలా నిర్మించుకోవాలి, ఎన్ని రకాల మైండ్సెట్లు ఉన్నాయి, వాటి తీరుతెన్నులు ఏమిటి అను విషయముల గురించి ఎస్ పీ మాస్ట్రో వారు చక్కగా వివరించారు. అలాగే యువతకు ముఖ్యమైన లాంగ్వేజ్ స్కిల్స్ గురించి, ఎటువంటి లాంగ్వేజ్‌ను వాడాలి, ఎటువంటి లాంగ్వేజ్‌ను వాడరాదు అను విషయముల గురించి చక్కగా వివరించారు.
ఈ పుస్తకాన్ని ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు చదివి తీరాలి. ఈ పుస్తకాన్ని చదివి ఆచరించి ఆచరింపజేసి మీ జీవితంలో మీరు గెలిచి ఇతరులకు మార్గదర్శకులై నిలవాల్సిందిగా మనవి.