Description
I AUYSA అనునది యువశక్తి జాగృతి కొరకు ఎస్ పీ మాస్ట్రో వారు నెలకొల్పిన
స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ యువతను శక్తివంతం, జ్ఞానవంతం, చైతన్యవంతం,
ప్రేమపూరితం, మానవత్వం, మంచితనంతో మెలిగేలా చేసి ఇతరులను వెలిగేలా చేస్తుంది.
I AUYSA ద్వారా ప్రతి యువకుడిని ఎస్ పీ మాస్ట్రో వారు నాయకుడిగా,
శాస్త్రజ్ఞుడిగా, గురువుగా, తత్త్వవేత్తగా, మానవతావాదిగా తీర్చిదిద్దడానికి సమాయత్తమయ్యారు.
అందుకు ప్రతి నెల రెండవ ఆదివారం యువతకు ప్రత్యేక ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా
తరగతులు నిర్వహింపబడుతాయి.
ఈ I AUYSA-9“ఆశ నీ గుండె చప్పుడు అయితే ప్రపంచం నీ చేతిలో కలం
అవుతుంది” అను పుస్తకంలో ఎస్ పీ మాస్ట్రో వారు యువతకు ఇచ్చిన రెండు వ్యక్తిత్వ
వికాస శిక్షణా తరగతుల సందేశాన్ని పొందుపరచడం జరిగినది. ఇండివిజ్యువాలిటీ (వ్యక్తి
తత్త్వం), క్యారెక్టర్ (వ్యక్తి యొక్క గుణం) మరియు పర్సనాలిటీ (వ్యక్తిత్వం), ఒరిజినాలిటీ
(వ్యక్తి యొక్క సహజ స్వభావం)ల గురించి, ఆహారం మనలో మనసును ఎలా ఉత్పత్తి
చేస్తుందో చక్కగా వివరించారు. కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ (భావ భాష వ్యక్తీకరణ
నైపుణ్యాలు), లాజిక్ (తర్కం) అవగాహనా శక్తిల గురించి మరియు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్
అండ్ ప్రజెంటేషన్ (పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, ఎలా రాయాలి) అను విషయముల
గురించి ఎస్ పీ మాస్ట్రో వారు చాలా సరళముగా వివరించారు.
ఈ పుస్తకాన్ని ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి. ప్రతి తండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు చదివి
తీరాలి. ఈ పుస్తకాన్ని చదివి ఆచరించి ఆచరింపజేసి మీ జీవితంలో మీరు గెలిచి ఇతరులకు
మార్గదర్శకులై నిలవాల్సిందిగా సహృదయపూర్వకముగా ఆశిస్తున్నాము.